*కాఫీ విత్…. ఆర్. రమాదేవి…168....ఎ.రజాహుస్సేన్…

*కాఫీ విత్…. ఆర్. రమాదేవి…168.


*నిదురించే కనుల ముందు  కావలి కాస్తుంది …
ఓ 'జ్ఞాపకం' .!!

*మల్లె పందిరి తీగలకు అల్లుకుపోయి ఆహ్లాదాన్ని స్తున్నాయి…"జ్ఞాపకాలు".!!

*ఇది  అతగాడిపై..ఆమె 'జ్ఞాపకాల పరిమళమే…!!

*ఇప్పుడామె   మోక్షగామి కాబోలు…!!

ఆర్.రమాదేవి గారు ఉస్మానియా యూనివర్సిటీలో…
చదువుకున్నారు.హైదరాబాద్లోనే వుంటున్నారు.ఈ మధ్య ఫేస్బుక్లో విస్తృతంగా ప్రేమ కవిత్వం రాస్తున్నారు.ఓ ప్రత్యే
కమైన శైలిని పట్టుకున్నారు.చదువుకుంటూ పోతే ఓ భిన్న
మైన అనుభూతికి లోనవుతాం.ప్రేమ కవిత్వం ఎప్పుడూ
మనసును తడి చేస్తుంది.హృదయానికి రిలీఫ్ ఇస్తుంది.
రమాదేవి గారు కవిత్వానికిదే ప్లస్ పాయింట్..!!

ఈరోజు కాఫీటైమ్ లో ప్రస్తావిస్తున్న రమాదేవి గారి కవిత
మనసుకు సంబంధించింది.మనిషిని నడిపించే రిమోట్
కంట్రోల్ మనసే.అయితే ఆ మనసును కూడా కలవర
పెట్టేది, నిద్రలేకుండా చేసేది ఇంకొకటి వుంది.అదే జ్ఞాపకం.
జ్ఞాపకం ఓ పట్టాన నిలవదు.మనసు మాట అసలే వినదు.
దాని పని అది చేసుకుంటూ పోతుంది. జ్ఞాపకం చేసే గార
డీ మామూలుగా వుండదు. పరిపరి విధాలుగా అది చేసే తమాషా ఓ రేంజ్ లో వుంటుంది.ఈ కవితలో కూడా ...
ఆతమాషా వుంది.అదేదో చూద్దాం రండి.!!

ఈలోగా ఓసారి ఈ కవితను చదవండి.!

"మనసు కెందుకో మెలకువ వచ్చింది
చీకటిలో తారట్లాడుతూ ఓ జ్ఞాపకం
అసహనంగా తిరుగుతోంది
అలికిడి చేయడం ఇష్టం లేక
నిదురించే కనుల ముందు 
కావలి కాస్తుంది...

ఏమైనా కానీ .. 
నిదురలేక ఎర్రబడిన జ్ఞాపకానికి
పంతం ఎక్కువే.. నాపై మక్కువ ఎక్కువే
కలగా  మనసు వాకిట నిలవాలని
పెంకితనం అరువు తెచ్చుకుంది
అచ్చంగా నీలాగా...."!!

ప్ప్రేమ కవిత్వంలో సహజంగానే ప్రేయసీప్రియులుంటారు.
ఇక్కడా అంతే...అతడంటే ఆమెకు ఎంతో ఇష్టం ! ఆమె
అతడికి ప్రాణం.ఆతడి తాలూకు జ్ఞాపకాల చెరలో ఆమె
బందీ. ఆరోజు వున్నట్టుండీ..మనసు కెందుకో మెలకువ వచ్చింది..చీకట్లో  తారాడుతూ ఓ జ్ఞాపకం అసహనంగా
అటూ ఇటు తిరుగుతోంది..అలికిడి చేయడం ఇష్టం లేక
కాబోలు…నిద్రపోతున్న కళ్ళముందు కావలి కాస్తోంది.!
పాపం! జ్ఞాపకానికి రాత్రంతా నిద్ర లేదు.అందుకే జ్ఞాపకం ఎర్రబడింది.ఏమాటకామాటే చెప్పుకోవాలి. జ్ఞాపకానికి
పంతం కాస్తంత ఎక్కువే సుమా ! ఆమె మక్కువను 'కల'
గా చేసుకొని,  మనసు వాకిట నిలవాలని పెంకితనాన్ని.. అరువు తెచ్చుకుంది. అచ్చం అతడిలా..!

నిజానికి ఇక్కడ అతడు లేడు.అతడి జ్ఞాపకం మాత్రమే
వుంది. జ్ఞాపకం అతడిదే కాబట్టి ..అతనికున్న పెంకితనం
జ్ఞాపకానికీ వుందన్నది ఇక్కడ కవయిత్రి చమత్కారం.
'అతడు లేక..అతని జ్ఞాపకాలతో ఆమె సతమతమవు
తూ నిద్ర రాక కళ్ళు ఎర్రబడ్డాయన్నది అర్థోక్తి.!

ఇంకో కవితలో ఈ కవితను ఇదే మూడ్తో  ఇంకాస్త …
ముందుకు తీసుకెళ్ళారు రమాదేవి.!

'అతడు  ధ్యానంలో  మౌనంగా ఉన్నాడు.ఈ సంగతి తెలి
సి కూడా ఆమె పదే పదే అతడున్న  చోటుకు వెళుతూనే వుంది. ఏమో ? ఎవరికి తేలుసు? అతడు మౌనం వీడు
తాడేమో? ఏ క్షణమైనా తనది కావొచ్చేమో? అనుకుంది
ఆమె..!!

కాలం నడకలో పువ్వు పూసింది . మొక్క  నవ్వింది. బండరాయి సైతం మాటలు నేర్చుకుంది.ఏమీ జరగని
చోట ఏ ఆనవాళ్లు లేని చోట చిరుగాలి లాంటి జ్ఞాపకా
లు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.అసలీ జ్ఞాపకాలు …
ఎలా వచ్చి చేరాయో తెలీదు.ఈ జ్ఞాపకాలు మనసు
అనే…మల్లె పందిరి తీగలకు అల్లుకుపోయి ఆహ్లాదాన్ని
స్తున్నాయి…!

అయితే…అతడింకా అక్కడే  ధ్యానంలోనే ఉన్నాడు... మౌనంగానే ఉన్నాడు... ఏంచేయాలో ఆమెకు పాలుబో
లేదు.పదే పదే అక్కడికెళ్లి .. తన క్షణాలు కొన్ని ఇద్దామ
న్న తలపు ఆమెది. కానీ అదేం విచిత్రమో గానీ..అది కాస్తా… కాలం మలుపులో ఆగిపోయింది ...బహుశా 'ఇప్పుడామె మోక్షగామి ' కాబోలు…

అతడి మనసెందుకో మసకబారి‌ంది. ఆమె కళ్ళు పొడి
బారాయి. ఆమె నీడ ఎందుకు దారి తప్పి పోయింది…
బహుశా దాచిన జ్ఞాపకాలు ఇక్కడ కథలుగా మిగిలా
యేమో?  ఏమో... ?

ఈ కవితలో ఏముందని మీరడగవచ్చు.ఇద్దరు ప్రేమికుల
❤️గుండె  సవ్వడి వుంది.ముఖ్యంగా అతగాడిపై..ఆమె
జ్ఞాపకాల పరిమళముంది.నిజానికిది ఫీల్ గుడ్ కవిత..
దీనిగురించి ఇంకా తెలుసుకోవాలంటే ప్రేమించిన హృద
యాన్నడగండి..!!

రమాదేవి గారి ప్రేమ కవితల్లో ఓ గమ్మత్తైన…' మత్తు వుంటుంది.అది పూలతేనె తాగితే కలిగే పరవశం.!!

*ఎ.రజాహుస్సేన్…
నంది వెలుగు…!!
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!